Tuesday, August 10, 2010

rest hour

                    చల్లగా వీస్తున్న చలి గాలుల నడుమ చనువుగా చెంత చేరుతున్న చిరు జల్లులతో కూడిన సంధ్యాసమయం. అద్బుతమైన ఆ ఆవరణంలో ఆనందమే ఆహ్వానిస్తున్నట్లుగా పలకరింపులతో పులకరించిపోతున్నాను. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వయసు మరచి గంతులేస్తున్న గడియలవి. అంతటి ఆనందం మరి అంతే ఆశ్చర్యం కూడాను. నా కలలో కూడా వూహించని ఘటన అది. అది ఏంటో తెలుసా "అవును నేను చెప్పక పోతే మీకెలా తెలుస్తుంది." ఆ రోజు ఆనందంను మించిన ఆశ్చర్యం ఎందుకంటే ఒక అందమైన అపురూపమైన అందాల బొమ్మ నన్ను పలకరిస్తుంటేనే పరవశించి పోతున్నాను. కాని తాను అదే సమయంలో తనకు నేనంటే ఇష్టమని నన్ను పెళ్లి చేసుకోవలనుకుంతున్నానని చెప్పింది. అంతే షాక్ తాకినట్లయింది. తనను ఒకసారి కూడా పలకరించిన సంధర్బం లేనే లేదు అలాంటిది నా మీద తనకి ప్రేమా! ఎందుకో విడ్డురంగా అనిపించింది. అందుకే smooth ga reject చేశాను. అదే మా ఇద్దరి చివరి కలయిక.
                               అల అలా సాగుతున్న సమయంలో నన్ను smooth ga touch చేస్తూ hot గా గుండెల్లో గుబులు రేపింది ఓ పరిచయం. అదే ఆనందానికి అర అంగుళం దగ్గరగా ఆప్యాయతలకు ఆలయంగా కన్పించింది. తనే నా వలపుల వన్నెలాడి రమ్య రూప సౌందర్య రాశి అయిన నవ్య. నవ్య పరిచయంతో నాకు ఒక నవ జీవితం మొదలయ్యింది. తను ఒక shop లో వుంటుంది. తను చాలా simple గా వుంటూ మంచి మానవత విలువలు కలిగి వుంది. అందుకే తను నాకే తెలియనంతగా నచ్చింది. అలా మొదలయ్యిన తన పరిచయం తరచుగా కలవడం జరుగుతూ వుంది. కాని ఏదో కొంచం బాధగా వుంటుంది అప్పుడప్పుడు. ఎందుకో నేను వెళ్ళిన కొన్నిసార్లు అక్కడ వరుణ్ నవ్యతో చాలా సన్నిహితంగా move అవుతుండటం తట్టుకోలేక పోతున్నాను. (He is looking better than me). అదేంటో తను నాది అన్న feeling నాది. అందుకే వరుణ్ ఎప్పుడైనా పలకరించిన పెద్దగా మాట్లడలనిపించేది కాదు. వరుణ్ మాత్రం నేను నవ్య ఎంత free గా వుంటున్న అతను పట్టించుకోనట్లుగానే enjoy చేస్తాడు. అది అతనిలో నాకు బాగా నచ్చింది. బయటకు మాత్రం కొంచం distance maintain చేసేవాడిని.
                             
              అలా నవ్యతో పరిచయం బాగా పెరిగింది. తన character నాకు బాగా నచ్చింది. తనకు కూడా  నా మీద మంచి opinion కలిగింది. తను నన్ను బాగా నమ్మేది తన దృష్టిలో నేను Mr.perfect. అంత సవ్యంగానే వుంది. కాని నా love express ఎలా ఎపుడు చెయ్యాలో తోచటం లేదు. తను నాతో పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో అని భయంతో చస్తున్నాను. అదే సమయంలో ఎక్కువ late చేస్తే వరుణ్ ఎప్పుడు  settle అవుతదేమోనని భయం.  నా feelings ని cover చేసుకోలేక ఒక రోజు సాయంత్రం నవ్యతో మీరు అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పాను అంతే కాదు మా parents ని వాళ్ళ ఇంటికి తీసుకువస్తానని చెప్పాను. అందుకు తను కూడా ఒప్పుకుంది. ఆ ఆనదంలో నిద్ర మానుకుని ఎప్పుడు తెల్లరుతుందా అని ఎదురు చూస్తున్నాను. అసలు నిద్ర వస్తే ఒట్టు. మా పెళ్లి ఎప్పుడ అని తేది కోసం తెగ తిప్పలుపడుతూ calendar వైపుగా చూస్తున్నాను. marriage date ఏది అయితే బాగుంటుందా అని వేదుకుతుండగానే తెల్లారింది. హాయిగా చంకలు దులుపుతూ హడావిడిగా తయారయ్యాను. 
                                    అందరి దేవుళ్ళ ఆశిర్వాధంతో నవ్య వాళ్ళ ఇంటికి మా parents తీసుకుని వెళ్లాను. వాళ్ళ ఇంట్లో కూడా చాలా సందడిగా వుంది. ఆ సందడి నాకు సమ్మగా స్వాగతం పలికింది. కాని ఆ సందడిలోనే కంగారు మొదలయ్యింది. నా నవ్య పెళ్ళయిన అమ్మాయిలా కనిపిస్తుంది కళ్ళు నిమురుకుంటూ నవ్య ని పలకరించా అప్పుడు తను నాకు ఇచ్చింది షాక్. నవ్యకి కూడా తన కూతురుని నాతో పెళ్లి చేయడం ఇష్టమని. ఏం చేయాలో అర్ధం కావడం లేదు అసలేంటో కూడా తెలియక తికమకపడుతున్నాను. కాని నాకు పెళ్లి చేసుకోవడం వాళ్ళ అయిన నవ్య వున్నా relation(friendship) ను కాపడుకుందామని కక్కుర్తి పడ్డాను
       
                 ఇది చాలదన్నట్టుగా నవ్య అసలు విషయం విప్పింది. తన కూతుర్ని షాప్ లో చూసి ప్రేమించానని ఈ పెళ్ళికి హాయిగా ఒప్పుకుందంట్ట. నవ్యకి నా మీద వున్నటువంటి నమ్మకమే తన కూతిరితో పెళ్ళికి సందేహం తెలపకుండా తలుపింధంట. అప్పుడు నన్ను కొంచం భాదించిన మరో సంఘటనా పాపం వరుణ్ నవ్య ల మద్య ఏదో వుంటుందని అనవసరంగా అపార్ధం చేసుకున్నాను కాని వాళ్ళిద్దరూ తల్లికోడుకులేమో అనుకుంటుండగానే అసలు విషయం తెలిసిందేమంటే నేను పెళ్లి చేసుకోబోతున్న నవ్య కూతురు ఎవరో కాదు నాకు already propose చేసిన అమ్మాయి గీతా. ఇదేంటి నా తల రాత ఇలా వుంది. నాకు అన్ని ఇలా జరుగుతున్నాఎంటి అనుకుంటూనే పెళ్ళికి green signal ఇచ్చాను. ఏదైతేనేం నన్ను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నాను అంతే కాదు నేను కోరుకున్న నవ్యతో బంధం బలపడుతుంధనుకుంటూ పెళ్లి కార్యక్రమాలు హడావుడిగా మొదలెట్టాను. రోజులు దగ్గర పడుతున్నాయి పనుల వేగం పుంజుకుని సక్రమంగా సాగుతున్నాయి. తీరా పెళ్లి సమయం వచేసరికి గీతా గీతా దాటుకుని వరుంతో jump. అలా గీతా వరుణ్ దైర్యం చేసి వాళ్ళ ప్రేమని పండించుకున్నారు.ఇది తెలిసి పరువు పోయిందే అనే బాధతో నవ్య చనిపోయింది.  అదే నా పాలిట శాపమయ్యింది . అలా నా జీవితం సర్వనాశనం చేసేసింది. అలా బాధలకే బందువుగా బంది అయ్యాను. అలా naa bad time కొనసాగుతూనే వుంది. ఆకరికి భగవంతుడు కూడా నా బాధలను చూస్తుండలేక వరాలన్నీ కురిపించాడు. ఆ వరాల ఫలితమే అలారం మోతతో మొదలయ్యిన morning. అంతా happy గా వుంది నేను ఏమి కోల్పోలేదని తెలిసి. అలా ఒకరోజు కల నన్ను కలవరపరిచింది.

1 comment:

  1. కేక పుట్ట్టిన్చావ్... చాల బాగుంది :)

    ReplyDelete