Saturday, August 21, 2010

యవ్వనపు ఎద లయలు

వేకువకై వేచుంట ఓ చినదాన వెన్నెలలోన
నీ వలపుల వానలో ముద్దులతో మురిపెంగా
తడుస్తూ చెరసాలగా  నీ కౌగిళ్ళలో కవ్వింతల భారాన్ని
మోస్తూ నీ అందమైన అణువణువును చనువుతో
చక్కిలిగింతలు పెడుతూ మౌనం వీడకుండా నీ పెదాలను
నా పెదాలతో పెనవేస్తూ ఓదార్పుగా నీ వయ్యారాల
వైరాగ్యాన్ని వదిలించడానికి వరుస కుదిర్చే వయసులో
సరసానికి సమరం సమకూర్చు సమయానికి సంప్రదింపులతో
సాన్నిహిత్యం స్వాగతం పలికేలా నీ పలుకులతో పరవశం
చేసుకోడానికి చేరే  వసంతం కోసం వేచి చూస్తూ
నాకు ఇష్టమైన నిన్ను ప్రియురాలిగా తలిచి
ఇల్లాలిగా వలచి నీకు ఇస్తున్న కానుకగా నా ఈ కవిత

No comments:

Post a Comment