చందమామ చనువుతో
చిరుజల్లులు చక్కిలిగింతలు
పెడుతున్నటువంటి తరుణంలో
నా మదిలో మెదిలే నీ ఊహలు
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
నీ దెంత చేరుటకై
నా దానివని నిన్ను తలచి
నా మది నిండా నిన్నే కొలచి
నన్ను కూడా వదిలేసి
నిన్నే నింపుకున్న నా ఎద
చప్పుడుల లయలు
నా యవ్వనానికి ఎరువై
నన్ను నాకు భారం చేస్తూ
నీ ఊహలతో తేలిపోతూ
లోకం(ప్రపంచం) చూడలేకపోతున్న
నిన్ను చూసిన నా కన్నులతో
నిండా నింపుకున్న నీ రూపం
అడ్డుగా తగలడుతుంటే కనీసం
పగలెంతో చీకటేంటో తెలియక
ఊరిస్తున్న నీ ఊహలకై
నా ఊపిరి నిలుస్తున్నది
నిరంతరం నిన్ను తలుస్తూ..
No comments:
Post a Comment