Wednesday, August 11, 2010

అందమైన ఓ శ్రీలేఖ అందుకో నా లేఖ

                  
                           

నీ జత చేరుటకై  చెక్కిలి గింతలతో పదిలమాయే నా ప్రాకులాట
నిన్ను చూసే వేకువకై వెన్నెలలోనే వెదుకులాట
వాకిలుకే వాలు పొద్దు వీలు కాదా వెన్నెల
ముగ్గులేస్తూ ముద్దుగుమ్మ కనికరించావే కనులతోన
దొంగచాటుగా దొరనవన దొరసాని గారి దయవలన
నీ నీడలోనే నిలచిపోన మండుటెండల మాయలోనే
నా కనులకు విందు నువ్వు నిలుచుంటే నా ముందు
నీ సిగ్గుల మొగ్గలతో నా మదిలో కమ్మిన మబ్బులు
మరుపెరుగని మురిపెంతో మున్ముందుకు సాగేల సవరించవ వివరాలు
విన్న విన్చావే నీ గోడు నే నీకు అవుదునా సరిజోడు.....
 
 **  వేరే వాళ్లకి రాయడానికి మనసు రాక నీకు రాసే దైర్యం లేక
       నాలో ఆత్రుతని ఆపుకోలేక  రాస్తున్నా ఆకర్షణ,ఆలాపనలు అమర్చిన ఈ లేఖ ఓ శ్రీలేఖ**

No comments:

Post a Comment